పన్ను వసూలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్‌ దాఖలు చేయాలని టి సర్కార్‌కు ఆదేశం

పన్ను వసూలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుకౌంటర్‌ దాఖలు చేయాలని టి సర్కార్‌కు ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 01: తెలంగాణలో ఏపీ వాహనాల నుంచి పన్ను వసూలు చేడయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెం. 15 ను జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలకు పన్నులు విధించడం జరుగుతుంది. దీన్ని సవాల్‌ చేస్తూ 71 మంది ట్రాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు బుధవారం నాడు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. టి. ప్రభుత్వం విధిస్తున్న పన్నులతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉమ్మడి రాజధానిలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని పిటీషనర్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ చేపట్టేవరకూ వాహనదారులు ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఎంట్రీ చెక్‌పోస్టుల వద్ద ఇవాళ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన 71 మందికి చెందిన వాహనాలకు సంబంధించి ధృవపత్రాలను స్వీకరించాలని, ఎలాంటి రుసుముల వసూలు చేయవద్దంటూ ఆదేశించింది.

కామెంట్‌లు