Latest Cinema News |
| Whatsapp free calling available Android devices |
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇప్పటివరకూ మెసే జ్ కోసమే వాట్సాప్. ఇప్పుడు కాల్స్ కోసం కూడా వాడుకోవచ్చు. వాట్సాప్‌తో కాల్ చే యాలంటే మీ ఫ్రెండ్స్‌లో ఎవరో ఒకరు మీకు కాల్‌చేసే వరకూ లేదా ఆహ్వానించే వరకూ వేచి ఉండక్కర్లేదు. ఈ మెసెంజర్‌తో కాల్ చేసుకునే సదుపాయం ఇప్పుడు వాట్సాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడుతున్న అందరికీ లభిస్తుంది. దీంతో వాట్సాప్ ఫ్రెండ్స్ జాబితాలో ఉన్నవారికి వేరే దేశంలో ఉన్నా సరే.. ఉచితంగా కాల్ చేయొచ్చు. వాట్సాప్‌తో కాల్ చేసేటప్పుడు, ఈ సౌకర్యం మన ఫోన్‌లోని టాక్‌టైమ్‌ను వాడదు. స్మార్ట్ ఫోన్‌కున్న ఇం టర్నెట్ కనెక్షన్‌ద్వారా ఈ కాల్‌ను వాట్సాప్ కనెక్ట్ చేస్తుంది. దీంతో.. ఇంటర్నెట్ కనెక్షన్‌లో డాటా చార్జీలు వాట్సాప్ కాలింగ్‌కు వర్తిస్తాయి కాబట్టి చాలా తక్కువ ధరతో కాల్ అయిపోతుంది. ఈ పద్ధతిలో 5 నిమిషాలు మాట్లాడితే ఒక ఎంబీ డాటా ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ ఫీచర్ ఉన్న వారు కొంత మందిని ఈ కాలింగ్ సౌకర్యానికి ఆహ్వానిస్తేనే పనిచేసేది. ఇప్పుడు ‘గూగుల్ ప్లే’లో ఉన్న వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.. వాయిస్ కాలింగ్ సౌకర్యం వచ్చేస్తుంది. మన ఫ్రెండ్స్ జాబితాలో ఉన్న వారికి కేవలం డాటా చార్జీలతో ఎంచక్కా కాల్స్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి