ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
చంద్రగిరి మలుపు కాడ.. ఎటెళ్లాలో తెలియక.. శ్రీవారి భక్తులకు ఇక్కట్లు !
ఆంధ్రజ్యోతి - చంద్రగిరి: చంద్రగిరి బస్టాండు కూడలిలో రహదారులకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడంతో శ్రీవారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి చిత్తూరు మీదుగా ఇటు వస్తుంటారు. తిరుపతి మార్గంలో వేలాదిమంది భక్తులు వాహనాల్లో, కాలిబాటన వస్తారు. అయితే నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారిలో చంద్రగిరికి మలుపు తిరిగే చోట బోర్డు లేదు. అలాగే చంద్రగిరి టవర్‌క్లాక్ సెంటర్ వద్ద శ్రీనివాసమంగాపురం, తిరుపతికి వెళ్లేందుకు భక్తులు తికమక పడుతున్నారు. అలాగే, సుదీర్ఘ ప్రాంతం నుంచి కాలిబాటన వచ్చే భక్తులు శ్రీవారి మెట్టుకు దారి తెలియక తిరుపతి మార్గంలో వెళ్తున్నారు. కొద్ది దూరం వెళ్లి తిరిగి వెనక్కు వస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనదారులు దారి తెలియక ఇబ్బంది పడుతున్నారు. నాగాలమ్మ మలుపు, టవర్ క్లాక్ వద్ద, ప్రధాన కూడల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి