![]() |
| ఒక రోజు ముందే వస్తానంటోన్న బాలయ్య |
నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న బాలకృష్ణ 98వ చిత్రం ‘లయన్’ మేడే కానుకగా మే1న విడుదల చేయాలనుకున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓ రోజు ముందే ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో విడుదల తేదీని మారుస్తున్నట్లు తెలిసింది. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్లు బాగా వస్తాయని చిత్ర నిర్మాత రుద్రపాటి రమణరావు అంచనా వేసినట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే కథనాయికలుగా నటిస్తున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి