ఇద్దరు పోలీసులు మృతి
సీఐకి తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా సూర్యాపేట
హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. బస్టాండ్‌లో బందోబస్తు డ్యూటీలో ఉన్న హోం గార్డులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వారు వెంటనే సీఐకి సమాచారం అందజేశారు. సీఐ వచ్చిన తర్వాత హోం గార్డులు ఆ వ్యక్తిని సోదా చేయడానికి ప్రయత్నించగా అతడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో కానిస్టేబుల్ లింగయ్య, హోం గార్డు మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, హోం గార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ప్రయాణికుడికి కూడా గాయాలయ్యాయి. అంతకు కొద్దిసేపటికి ముందు కారులో హైదరాబాద్ వస్తున్న దొరబాబు అనే వ్యక్తిపై కూడా ఇద్దరు కాల్పులు జరిపినట్టు తెలిసింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి