ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
ఎన్టీఆర్ తండ్రిగా మళయాళ సూపర్ స్టార్..?

చాలాకాలం తరువాత టెంపర్ సినిమాతో సక్సెస్ ను చవిచూసిన టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్... సుకుమార్ డైరెక్షన్ లో నటించబోయే తన తదుపరి సినిమాతో మరో భారీ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గెటప్ లో మార్పులు చేశాడని.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా యంగ్ టైగర్ గడ్డంతో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు ఎన్టీఆర్ కు తండ్రిగా నటిస్తున్నాడనే టాక్ కూడా వినిపించింది.
అయితే లేటెస్ట్ గా ఈ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ వర్గాలు కొత్తగా చర్చించుకుంటున్నాయి. సినిమాలో జగపతిబాబు విలన్ రోల్ లో కనిపించనున్నాడని సినీ జనం చెబుతున్నారట. దీంతో ఈ నయా సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా నటించబోయేది ఎవరనే దానిపై ఫిలింనగర్ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది.
ఎన్టీఆర్ సుకుమార్ సినిమాలో జగపతిబాబుది నెగిటివ్ రోల్ అని క్లారిటీ రావడంతో... ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫాదర్ గా మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించే ఛాన్స్ ఉందని టాక్ మొదలైంది. తెలుగులో చాలా ఏళ్ల క్రితం రిలీజైన 'గాండీవం' సినిమాలో తళుక్కుమన్న మోహన్ లాల్... ఇప్పటి వరకు మరే తెలుగు స్ట్రెయిట్ మూవీలోనూ యాక్ట్ చేయలేదు. అయితే కోలీవుడ్ లో విజయ్ హీరోగా నటించిన 'జిల్లా' సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ లాల్.. ఎన్టీఆర్ సుకుమార్ సినిమాలో నటించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదంతా వట్టి ప్రచారం మాత్రమే అని.. మోహన్ లాల్ మలయాళంలోనే ఫుల్ బిజీగా ఉన్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి... ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లోని సినిమాలో మోహన్ లాల్ నటిస్తే... అది ఆ సినిమాకు ఎంతో కొంత అడ్వాంటేజ్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి