ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
రెండు కోట్లు ఇస్తే ప్రభాస్ తల్లి పాత్రకు రెడీ..?

‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ స్పీడు పెంచేసింది. ఒక వైపు బాలీవుడ్‌లో నటిస్తూనే తెలుగు, తమిళ సినిమాల వైపు కూడా కన్నేసింది. రవి ఒడయార్ రూపొందించే 'మదర్' సినిమాలో నటించడానికి ఒప్పుకున్న శ్రీదేవి తాజాగా తెలుగులో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓకే అయినట్లు తెలిసిందే. అందులో ప్రభాస్ తల్లి పాత్ర కోసం ఇప్పటికే అనేక మందిని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ శ్రీదేవినే ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్ సమాచారం. అయితే రెండు కోట్ల రూపాయలు పారితోషికం అడిగిందట. అయితే రెండు కోట్ల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి