చాలా గ్యాప్ తర్వాత దర్శనమిచ్చిన సీనియర్ హీరోయిన్

Nagmaపండు పండు పండు.. బుజ్జి పండు అంటూ యాపిల్ పండులా చూడగానే తినాలనిపించే అందాలతో తెలుగు జనాలను చిత్తు చేసింది నగ్మ. 'పెద్దింటి అల్లుడు' మూవీతో అందాల దండయాత్ర మొదలుపెట్టి.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ అరెబియన్ గుర్రం.. ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా టాప్ లేపింది. తన భారీ అందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ సుందరాంగి సినిమాలో ఉందంటే చాలు.. బొమ్మకు తిరుగే లేదన్నట్లు సాగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రకథానాయికలందరితోనూ ఆడిపాడి అదరగొట్టింది ఈ నగుమోము నగ్మ. అయితే ఆ తర్వాత యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ సెక్సీ బ్యూటీ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన నగ్మా.. ఆ తర్వాత మరాఠీ సినిమాల్లో రాణిచటంతో పాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది... కొంత గ్యాప్ తర్వాత అత్త పాత్రలోనూ మెరిసిన నగ్నా ఇటీవలే తెలుగునాట ఓ బుల్లితెర కార్యక్రమంలో తళుక్కుమని.. పదును తగ్గని అందాలతో మైమరపించింది....రాఘవేంద్రరావు దర్శకత్వంలో పలు సినిమాల్లో శృంగార నాయికగా జనం మదిని దోచిన నగ్మా.. దర్శకేంద్రుడి బుల్లితెర కార్యక్రమం సౌందర్యలహరిలో దర్శనమిచ్చింది ఈ మాజీ గ్లామర్ క్వీన్. టాలీవుడ్ కు దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగు బాగా మాట్లాడి అందరికీ ఆనందాన్ని పంచింది. అప్పుడప్పుడు మాటలు కొంచెం వెతుకున్నట్లు అనిపించినా.. చాలా వరకు తెలుగులో మాట్లాడేందుకే ఆసక్తి చూపించింది. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమంలో సూపర్ హిట్ కాంబినేషన్ డైరెక్టర్ రాఘవేంద్రరావుగారు మీకు ఏం నేర్పించారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బూతులు నేర్పించారని నవ్వుతూ సమాధానం చెప్పింది నగ్మా.... అదేమంటే.. రాఘవేంద్రరావు సినిమాలో పాలు, పండ్లు, బొడ్డు.. లేకుండా పాటలు ఉండవు. ఆ విషయాల్ని చెప్పేటప్పుడు రాఘవేంద్రరావు గారు అనుకోకుండా కొన్ని మాటలు అనేవారు. వాటినే నేర్చుకున్నానని వివరణ ఇచ్చింది. మరి టాప్ డైరెక్టర్ నుంచి బూతులు నేర్చుకున్నానని అంటున్న ఈ ముదురు భామ.. మన హీరోల నుంచి ఏం నేర్చుకుందో చెపితే వినాలని తెలుగు ప్రేక్షకులకు ఆశగా ఉంది. మరి నగ్మాకి ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో చూడాలి.


కామెంట్‌లు