హైదరాబాద్ : శివబాబు బండ్ల సమర్పించిన సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సందర్బంగా రెండు పోస్టర్స్ ని విడుదల చేసారు. అవి ఇక్కడ విడుదల చేసారు. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ... టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...‘' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము ‘' అన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో కలెక్షన్స్ బాగనే సంపాదించింది.
ఈ సినిమాకు కథను వక్కతం వంశీ సమకూర్చగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ జంటగా నటించిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్‌లో వచ్చిన బృందావనం, బాద్‌షా, రెండు హిట్‌లు సాధించగా టెంపర్‌తో హాట్రిక్ కొట్టారు. ఎన్టీఆర్ పర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, పూరి డైరెక్షన్, డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్-కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సైతం ప్రక్షకులను కట్టిపడేస్తున్నాయి
టెంపర్ కథేమిటంటే...వైజాగ్ ట్రాన్సఫరై వచ్చిన దయ(ఎన్టీఆర్) ఓ పూర్తి అవినీతి పోలీస్ ఆఫీసర్. అక్కడ వాల్టేర్ వాసు(ప్రకాష్ రాజ్) అనే లోకల్ డాన్ తో చేతులు కలుపి అతని అరాచకాలలో సాయం చేయటం మొదలెడతాడు. మరో ప్రక్క దయ ఓ యానిమల్ లవర్ (కాజల్) తో ప్రేమలో పడతాడు. ఓ చిత్రమైన పరిస్దితుల్లో ఓ కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేర్చే క్రమంలో దయ...దయగా మారతాడు...వాసు సామ్రాజ్యాన్ని కూల దోయటం మొదలెడతాడు. అంతేకాక చివరకు తన ప్రాణాలమీదకు సైతం తెచ్చుకుంటాడు. ఇంతకీ దయ గర్ల్ ఫ్రెండ్ కోరిన కోరిక ఏమిటి... దయ లో మార్పుకు కారణమైన ఆ సంఘటన ఏమిటి... అసలేం జరిగింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.50 రోజులు పూర్తి చేసుకున్న 'టెంపర్' (పొస్టర్స్)


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి