చంద్రబాబు ,కేసీఆర్ ... ఇంటర్నెట్ లో ఎవరు ఫస్ట్?


కేసీఆర్ , చంద్రబాబు.. వేరువేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నా వీరి మధ్యపోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాజకీయాలను శాసిస్తున్నవ్యక్తులు వీరే. మరి వీరిద్దరిలో ఎవరి గ్రేట్.. ఈ చర్చ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తెలుగురాష్టాల ముఖ్యమంత్రులుగా అభివృద్ధిలో ఒకరికొకరు గానే పోటీపడుతున్నారు. అభివృద్ది, పరిపాలన వంటి విషయాలను పక్కనపెడితే.. ఇంటర్ నెట్ సెర్చింగ్ విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికర ఫలితాలు ఇచ్చింది. నెట్లో ఎవరి గురించి నెటిజన్లు ఎక్కువగా వెదుకుతున్నారో తెలుసుకునేందుకు గూగుల్ నిర్వహించిన సర్వేలో ఓవరాల్ గా కేసీఆరే పై చేయి సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా వీరిద్దరిలో కేసీఆర్ గురించే నెటిజన్లు ఎక్కువగా వెదికారట. ఐతే ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే.. తెలుగు రాష్ట్రాల వరకూ లెక్కిస్తే మాత్రం కేసీఆర్ కంటే చంద్రబాబు గురించే ఎక్కువగా వెదికారట.

కామెంట్‌లు