దర్శకుడు పురిజగన్నాథ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది . ఇప్పటికే 25 శాతంకు పైగా షూటింగ్ పూర్తి చేశారట. త్వరలో గోవా, ఆ తర్వాత విశాఖలో షూటింగ్ జరుపుకోనున్నదట. ఇలా బిజీ షెడ్యుల్ తో దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ , ఎన్టీఆర్ సినిమా సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడట . బృందావనం సినిమాలో కంటే అందంగా కనిపిస్తారట.
ఈ కొత్త లుక్ ఇప్పట్లో ఎవరికీ చూపించావద్దని డిసైడ్ అయ్యారట. అందుకే ఎన్టీఆర్ ఫాన్స్ ని కలసినప్పుడు ఫోటోలు తీయోద్దని సూచిస్తున్నారట. అంతేకాదు ఈమధ్య ఎన్టీఆర్ అభిమానులతో ఫోటో షూట్ ఉంటుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫోటో షూట్ కూడా వాయిదా ఆడినట్లు సమాచారం. పూరి , ఎన్టీఆర్ ల కొత్త సినిమా విడుదలయ్యే వరకు ఎన్టీఆర్ కొత్త లుక్ బయటకు రాకుండా ఉండే ఉద్దేశ్యంతోనే ఈ ఫోటోషూట్ కార్యక్రమం వాయిదా వేశారట .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి