![]() |
శభాష్ చంద్రబాబు ! |
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏనోట విన్నా ఇదే మాట.. శభాష్ చంద్రబాబు. కారణం లేక పోలేదు, ఆధికారంలో లేనప్పుడే ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ బాసటగా నిలిచే నాయకుడు చంద్రబాబు. ఇప్పుడు ఆధికారంలో ఉండి ఇలాంటి విపత్తు సమయంలో ఎలా స్పందిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. జనం కోసం, ప్రచారం కోసం ఎన్ని టెక్నాలజీ కబుర్లు చెప్పినా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పుడు తీసుకున్న స్టెప్స్ మాత్రం నూటికి నూరుపాళ్లు ప్రశంసనీయం. ఇంతటి బీభత్సమైన తుపాను వచ్చిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడ కూర్చోవడం అన్నది ఓ ముఖ్యమంత్రిగా అభినందనీయమైన పని. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎన్నడూ చేయనిది. ఇలా అనడంలో ఎటువంటి మొహమాటం లేదు. ఇంతటి విపత్తు తరువాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడే కూర్చోవాలని నిర్ణయించడం గొప్ప విషయం. అలాగే మంత్రులను, యంత్రాగాన్ని అక్కడకు తరలించడం కూడా. పని చేసే వారిలో బాధ్యత, భయం అన్నది ముఖ్యం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నాడంటేనే పనులు పరుగెడతాయి. ఇప్పుడు అక్కడే వున్నారంటే మరీ స్పీడుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా వుంది. క్రైసిస్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు దిట్ట. ఆ సామర్థ్యం కూడా ఇప్పుడు పనికి వస్తుంది. చకచకా డైరక్షన్లు ఇవ్వడం, పార్టీ నాయకులను, మంత్రులను, పార్టీకి అనుబంధంగా వున్న వ్యాపార వేత్తలను కదిలించడం మాత్రమే కాదు, ఎవరి వల్ల ఏ పని అవుతుంది. ఎవరు ఏం చేయగలరు అన్నది గమనించి వినియోగించడంలో చంద్రబాబును మించిన మొనగాడు లేరు. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖకు ఇది చాలా అవసరం. నీళ్లు, పాలు, విద్యుత్, పెట్రొలు అత్యవసరాలు. ఇప్పుడు విశాఖలో పాలు అన్నవి దొరకడం లేదు. నీళ్ల సీసాలు యాభై రూపాయిలు అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం అక్కడ వుండడం వల్ల సమస్యలు వీలయినంత వేగంగా సద్దుమణిగే అవకాశం వుంది. పరిస్థితి వీలయింనంత త్వరగా నార్మల్ కు వస్తుంది. స్పీడుగా స్పందించడంలో, చకచకా నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు చాతకాదు. ఇధి మన రాష్ట్ర చరిత్ర చెప్పిన సత్యం. అందుకే శభాష్ చంద్రబాబు అనడంలో సందేహం లేదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి