కథః
అనాధ అయిన శంకర్
(మహేష్) ని
చేరదీస్తాడు పోలీస్ అధికారి
రాజారావు(రాజేంద్రప్రసాద్) .
కానీ ' అనుకోని పరిస్ధితుల్లో
రాజరావు పొరపాటుపడి ఓ
కేసులో శంకర్ బోస్టన్
స్కూల్ కి పంపుతాడు.
శంకర్ అక్కడే పెరిగి
పెద్దవాడయ్యి…
ఎనకౌంటర్ శంకర్ గా
బయిటకు వస్తాడు. డైరక్ట్
గా బుక్కపట్నం లో
డ్యూటీకి దిగిపోతాడు.
అక్కడ
అరాచకాలు చేస్తున్న విలన్
దామోదర్ అలియాస్
దాము (సోనూసూద్) ని
అడ్డుకోవటానికి పోలీస్
యూనిఫాం తో తన దైన శైలిలో
చెలరేగిపోతాడు. అంతేకాకుండా
దాము కట్టబోతున్న పవర్
ఫ్లాంట్ ప్రాజెక్టుని
సైతం ఆపుచేయిస్తాడు. ఈ
లోగా దాము గురించి మరో
షాకింగ్ నిజం తెలుస్తుంది.
అప్పుడు దాము సామ్రాజ్యా
పూర్తిగా
కూలదోయటం మొదలెడతాడు.
అసలు ఎనకౌంటర్ శంకర్ కి,
దాము కి ఉన్న రిలేషన్
ఏమిటి..కథలో స్వీట్స్ సరోజ
(తమన్నా) పాత్ర ఏమిటి…
డిల్లీ సూరి
(బ్రహ్మానందం) కథలోకి
ఎంట్రీ
ఇచ్చి,ఏం చేస్తాడు…వంటి
విషయాలు తెలియాలంటే
సినిమా చూడాల్సిందే.
విశ్లేషణః
ఈ సినిమా కోత్తదేం కాదు…
అలాగని
కథనమూ అద్బుతంగా
లేదు. చాలా రొటీన్ కథకు, చాలా
ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే
అందించారు శ్రీను వైట్ల.
అయితే అది మహేష్ సినిమా
కావటం, కామెడీ పండటం తో
ఆ సమస్య హైలెట్ కాలేదు.
అలాగే… ఫస్టాఫ్ మీద
పెట్టిన దృష్టి సెకండాఫ్
మీద
అసలు పెట్టలేదనిపిస్తుం
ఒక్కసారి ట్విస్ట్ లు రివిల్
అయ్యాక…చాలా సాదాసీదా
సినిమా చూస్తున్న ఫీలింగ్
వస్తుంది. అలాగే
సోనూసూద్ నెగిటివ్
క్యారెక్టర్ ని సైతం ఎలివేట్
చెయ్యకపోవటంతో కొన్ని
చోట్ల సీన్స్
నడుస్తున్నాయి కానీ హీరో
ప్యాసివ్ గా మిగిలిపోవాల్సి
వచ్చింది. ఇక
తెలుగు సినిమాకు కీలకంగా
నడిచే ఇంటర్వెల్, క్లైమాక్స్
కూడా చాలా సింపుల్ గా సాదాగా,
ఇంకా చెప్పాలంటే ప్లాట్ గా
ఉన్నాయి.
నటీనటుల పనితీరుః
యాక్షన్ కామెడీ… ఇప్పటి
టాలీవుడ్ భాక్సాఫీస్
గెలుపు సూత్రం అని
నమ్మి స్టార్
హీరోలు వరసగా చేస్తున్న
చిత్రాలలో ఇది ఒకటి. కొద్దిగా
రివేంజ్, బోల్డు కామెడీతో
ఎప్పటిలాగే శ్రీను వైట్ల
తనదైన శైలి పంచ్ లు,
యాక్షన్ ఎపిసోడ్స్ లగేజీ తో
దిగిపోయాడు. అతని కామెడీ
కు సూపర్ స్టార్ సూపర్బ్
ఫెరఫార్మెన్స్ తోడయ్యి…
థియోటర్లను నవ్వులలో
ముంచెత్తుతోంది.
చూసేవారికి పెద్దగా శ్రమ
లేకుండా ఓ హీరో, విలన్,
చిన్న లవ్ స్టోరీ, మధ్యలో
బుల్లి రివేంజ్, దానికి తగ్గ
సెంటిమెంట్ పెట్టుకుని
శ్రీను వైట్ల కామెడీకే
పూర్తి
స్ధానం ఇస్తూ చెలరేగిపో
అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత
కామెడీని సెకండాఫ్ లో
తీసుకురాకుండా కథలోకి
వచ్చి…యాక్షన్, రివేంజ్ తో
నడపాడు. ఇంటర్వెల్
సైతం ట్విస్ట్ లు ఏమీ
పెట్టుకోకుండా…ప్లాట్ గా
వేసాడు. అయితే ఒకటి
మాత్రం నిజం…ఇలాంటి కథ
మహేష్ బాబు కాకుండా
మరొకరు అయితే ఎంత
వరకూ మోయగలరనేది
అనుమానమే.
అటు బ్రహ్మానందం డాన్స్
ఎపిసోడ్స్, ఇటు శృతి
హాసన్ హాట్ ఐటం సాంగ్,
మధ్య మధ్యలో మహేష్
బాబు తన సినిమాల్లోంచే
కథలు తీసుకుని ఎదుటివారికి
చెప్తూ బోల్తా కొట్టించే
తీరు ఈ సినిమాకు బోనస్.
ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో
వచ్చే మీలో
ఎవరు కోటీశ్వరుడు(మీలో
ఎవరు పోటుగాడు) టైప్
ఎపిసోడ్, ఆ తర్వాత వచ్చే
మహేష్ ఫ్లూట్ డాన్స్
హైలెట్ గా నిలుస్తాయి.
నటీనటులు :మహేష్ బాబు,
తమన్నా,
డా.రాజేంద్రప్రసాద్,
ప్రకాష్రాజ్, బ్రహ్మానందం,
నెపోలియన్,సోనూసూద్
రచన: అనీల్ రావిపూడి,
ఉపేంద్ర మాధవ్,
సంగీతం: ఎస్.ఎస్.థమన్,
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
పాటలు: భాస్కర్ భట్ల,
శ్రీమణి
నిర్మాతలు: రామ్ ఆచంట,
గోపీచంద్ ఆచంట, అనీల్
సుంకర,
కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-
దర్శకత్వం: శ్రీను వైట్ల.
రేటింగ్ 2.75/5.00
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి