మరొక్కసారి తెలుగువారిని ఆదుకున్న బాబు !!

' ' Get up to 25% off on Tablets - Dell, Lenovo,Samsung, HCL and others. add facebook like button '


మా అబ్బాయి మీ పుణ్యాన ఇంటికి
చేరాడు.బాబుకు ' టీ-విద్యార్థి తండ్రి ఫోన్
‘కాశ్మీర్లో వరదల్లో చిక్కుకొన్న మా
అబ్బాయి మీ పుణ్యాన ఇంటికి చేరాడు. మీ
వాళ్లు ఇంటి వరకూ వచ్చి దింపారు.
ప్రాంతం ఏదన్నది పట్టించుకోకుండా
మీరు చేసిన సాయం మరవలేం’ అని
తెలంగాణ విద్యార్ధి తండ్రి
ఒకరు శుక్రవారం ఏపీ
సీఎం చంద్రబాబుకు ఫోన్లో
ధన్యవాదాలు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా
బోద్ నియోజకవర్గంలోని ఇచ్ఛోడకు చెందిన
ఆడె మానాజీ కుమారుడు మంగేష్ కుమార్
శ్రీనగర్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ మొదటి
సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలి
వరదల్లో ఆ ఎన్ఐటీ మునిగిపోయింది.
అక్కడి
తెలుగు విద్యార్థులు కొందరు ఎలాగోలా
లడక్ వరకు రాగలిగారు. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఈ లోపు వారి జాడ కనుక్కొని
వారిని అక్కడ నుంచి తీసుకువచ్చి ఎవరి
ఇళ్లకు వారిని చేర్చింది.
తన కొడుకు ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి
చేరడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోయిన
మానాజీ రకరకాల ప్రయత్నాలు చేసి
శుక్రవారం ఫోన్లో చంద్రబాబుతో
మాట్లాడగలిగారు.
బాబుకు కృతజ్ఞతలు చెబుతూ ఆయన
భోరున ఏడ్చేశారు. ‘నాలుగైదు రోజుల నుంచి
ఫోన్లు కలవక ఇంట్లో ఏడుస్తూ కూర్చుని
ఉన్నాం. మా అబ్బాయి మాకు దక్కుతాడా లేదా
అన్నది అనుమానంగా ఉంది. అలాంటి
పరిస్థితుల్లో మీరు మా వాడిని ఇంటిదాకా
పంపించారు. మీరు మా పాలిటి దేముడు.
మేం తెలంగాణ అయినా మీరు ఈ
సాయం చేశారు’ అని మానాజీ ఆయనతో
అన్నాడు. ‘‘ప్రాంతం ఏదైనా మనం అంతా
తెలుగువాళ్లమే. తెలుగువాళ్లకు ఎక్కడ ఏ
కష్టం వచ్చినా ఆదుకోవడానికి
నేను ముందుంటా. ఏమీ భయపడాల్సిన
అవసరం లేదు. ఏదైనా అవసరం అయినా
నన్ను అడగండి. నాకు చేతనైనంత చేస్తా’
అని చంద్రబాబు ఆయనతో చెప్పారు.
రాష్ట్రం విడిపోయినా తెలుగు వారందరినీ
చంద్రబాబు గుర్తుంచుకొని
సాయం చేయడం తన
మనసును కదిలించిందని, అందుకే ఆయన
ఫోన్ సంపాదించి మాట్లాడానని చెప్పారు. తమ
పిల్లలతో కూడా చంద్రబాబు మధ్యలో
మాట్లాడి ఽధైర్యం చెప్పారని, ఆయన
ఫోన్లు వారికి చాలా మనో ధైర్యం ఇచ్చాయని
పేర్కొన్నారు.

add facebook like button '

కామెంట్‌లు