Prabhas reacts strongly to rumours about sharmila! !

హైదరాబాద్, జూన్ 15 : సోషల్ వెబ్సైట్లలో హల్చల్
చేస్తున్న కథనాలపై టాలీవుడ్ హీరో ప్రభాస్
ఎట్టకేలకు స్పందించారు. తనకూ, వైసీపీ నేత
షర్మిలాకు సంబంధాన్ని
అంటగడుతూ జరుగుతున్న ప్రచారాన్ని
ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాంటి
రూమర్లను నమ్మవద్దని ఆయన
అభిమానులను కోరారు.
అసలు షర్మిలాతో తనకు పరిచయమే లేదని ప్రభాస్
అన్నారు. చాలా కాలం క్రితమే ఈ విషయం తన
దృష్టికి వచ్చినప్పటికీ సీరియస్గా తీసుకోలేదని,
ఇప్పుడు స్పందించక తప్పడంలేదని ఆయన
అన్నారు. తన ఆరోగ్యంపై వచ్చిన
కథనాలు సైతం అవాస్తవాలేనని ప్రభాస్ తెలిపారు.
అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిపై
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన
కోరారు.


కామెంట్‌లు